'దేవదాస్'కలెక్షన్లు నాట్ బ్యాడ్!


ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలోకి కొత్త దర్శకులు ఎంట్రీ ఇస్తున్నారు. ఎంట్రీ ఇవ్వడమే కాదు సీనియర్ దర్శకులతో పోటీ పడుతు అద్భుతమైన సక్సెస్ లను అందిస్తున్నారు. రీసెంట్ గా తరుణ్ భాస్కర్ 'పెళ్లిచూపులు',సందీప్ వంగా 'అర్జున్ రెడ్డి', అజయ్ భూపతి 'ఆర్ ఎస్ 100' లాంటి చిత్రాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఇదే కోవలో యువ దర్శకులు శ్రీరామ్ ఆదిత్య గురించి కూడా ఇండస్ట్రీ ఇదే మాట్లాడుకుంటుంది. "భలే మంచి రోజు" అన్నపుడు కుర్రాడెవరో భలే తీసాడే సినిమా అనుకున్నారు.


ఆ తర్వాత "శమంతకమణి" అంటూ ఏకంగా నలుగురు కుర్ర హీరోలను కలిసి ఒకే సినిమాలో చూపించాడు. మనోడికి సరైన టైమ్ వచ్చి.. స్టార్స్ పడితే మాయ చేస్తాడని అనుకుంటున్న సమయంలో నాగార్జున, నాని కాంబినేషన్ లో 'దేవదాస్'తో వచ్చాడు. నాని, నాగార్జున హీరోలుగా వచ్చిన ఈ చిత్రంలో శ్రీరామ్ ఆదిత్య టేకింగ్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా కామెడీ సీన్స్‌పై అతడికి ఉన్న పట్టు చూసి మురిసిపోతున్నారు హీరోలు. ఈ సినిమా కమర్షియల్‌గానూ సత్తా చూపిస్తుంది. 
కచ్చితంగా "దేవదాస్" తర్వాత శ్రీరామ్ ఆదిత్య రేంజ్ మారిపోయినట్లే కనిపిస్తుంది.ఈ చిత్రం గురించి మౌత్ టాక్ బాగానే వుండడం, ఎంటర్ టైన్ మెంట్ జోనర్ కావడంతో ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజులు మంచి వసూళ్లే వస్తాయని అంచనా వేస్తున్నారు. సినిమాను ఒక్క సీడెడ్ మినహా నైజాం కానీ, ఆంధ్ర కానీ అమ్మలేదు. తొలిరోజు వసూళ్లు ఇలా వున్నాయి. అమెరికా ప్రీమియర్ కలెక్షన్లు.. నాగార్జున కెరీర్ లో హయ్యెస్ట్ కాగా.. నాని కెరీర్ లో ఇది నాల్గవ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టాయి. ఈ సినిమా తొలిరోజే 7 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. రెండోరోజు కూడా పెద్దగా కలెక్షన్లు పడిపోలేదు. వీకెండ్ వరకు రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాలలో 'దేవదాస్' రెండు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ :
నైజాం - 2.5 కోట్లు
ఉత్తరాంధ్ర - 0.87 కోట్లు
సీడెడ్ - 1.01 కోట్లు
గుంటూరు - 0.68 కోట్లు
ఈస్ట్ - 0.53కోట్లు
వెస్ట్ - 0.38 కోట్లు
కృష్ణ -0.48కోట్లు
నెల్లూరు - 0.26కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణా టోటల్: రూ.6.71కోట్లు

like us in facebook

                                                                               -DURGA PRASAD NAIDU
'దేవదాస్'కలెక్షన్లు నాట్ బ్యాడ్! 'దేవదాస్'కలెక్షన్లు నాట్ బ్యాడ్! Reviewed by Durga prasad naidu on September 29, 2018 Rating: 5
Powered by Blogger.